News April 1, 2025
కాకాణి నేడు విచారణకు హాజరవుతారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయనకు నోటీసులు అందజేసేందుకు పోలీసులు పొదలకూరు, హైదరాబాదుకు వెళ్లినా అందుబాటులో లేరు.ఇవాళ ఉ.11గంటలకు నెల్లూరు DSP ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా APR 18కి విచారణ వాయిదా పడింది. దీంతో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
Similar News
News December 11, 2025
ఇందుకూరుపేట సీసీ గుండెపోటుతో మృతి

ఇందుకూరుపేట మండలం వెలుగు కార్యాలయంలో సీసీగా విధులు నిర్వహిస్తున్న ముదువర్తి శీనమ్మ (36) గుండుపోటుతో మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెల్లో నొప్పి అంటూ స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఏరియా హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
News December 11, 2025
నెల్లూరు మేయర్ పదవి.. రంగంలోకి కీలక YCP నేత.?

నెల్లూరు మేయర్ స్రవంతిని గద్దె దించేందుకు కూటమి నేతలు చేస్తోన్న ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు YCP గట్టిగా ప్రయత్నిస్తోందట. ఓ మాజీ మంత్రి అతని అనుచరగణంతో కార్పొరేటర్లను లొంగదీసుకునేందుకు సిద్ధమయ్యారట. మాటలకు లొంగితే ఓకే.. లేకుంటే డబ్బుతో కొనడమా అన్న ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించినట్లు సమాచారం. ఎవరి ప్రయత్నాలు ఎంత వరకు సఫలీకృతం అవుతాయో చూడాల్సి ఉంది.
News December 11, 2025
నెల్లూరు: శిక్షణ పూర్తయినా.. తప్పని నిరీక్షణ.?

మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కుట్టు మిషన్ల శిక్షణ చేపట్టింది. 3 నెలల పాటు ఈ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందిస్తామన్నారు. శిక్షణ పూర్తయి 3నెలలు అయినా మిషన్లు అందలేదు. మహిళలు 3 నెలల నుంచి కుట్టు మిషన్లు, ధ్రువ పత్రాలు కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 31 శిక్షణా కేంద్రాల్లో 1808 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి అయిన వారికి మిషన్లు అందించాలని మహిళలు కోరుతున్నారు.


