News April 7, 2025
కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హై కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. క్వార్జ్ మైనింగ్ కేసులో నమోదైన కేసు నుంచి ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది.
Similar News
News April 17, 2025
నెల్లూరులో వ్యభిచారం గుట్టురట్టు

నెల్లూరులోని వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన మహిళ నెల్లూరు హరనాథపురం శివారులోని ఓ అపార్ట్మెంట్లో ఇంటిని రెంట్‌కు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు దాడి చేశారు. ఆమెతో పాటు విటుడు మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
News April 17, 2025
అలా చేస్తే రూ.10 లక్షల ఫైన్: నెల్లూరు జేసీ

కాల్షియం కార్బైడ్ ఉపయోగించి కృత్రిమ పద్ధతిలో పండ్లను మగ్గపెట్టే పండ్ల వ్యాపారులకు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ హెచ్చరించారు. ఏడు శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతోందని, అధికారులు తనిఖీలు వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.
News April 17, 2025
నెల్లూరులో నేడే జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం

జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం గురువారం 11 గంటలకు నెల్లూరు కలెక్టర్ ఓ.ఆనంద్ అధ్యక్షతన జరగనున్నట్లు జల వనరుల శాఖ ఇంజినీర్ డాక్టర్ దేశి నాయక్ తెలిపారు. బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులు ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాని కోరారు. నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ మీటింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.