News August 1, 2024
కాకినాడలో గంజాయి లిక్విడ్ బాటిల్స్ స్వాధీనం
కాకినాడ నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. 48 గంజాయి లిక్విడ్ సీసాలు, ఆరున్నర కిలోల ఎండు గంజాయి, 4500 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు DSP హనుమంతరావు తెలిపారు. కాకినాడకు చెందిన ఇస్మాయేల్, మౌలాలి, అల్లూరి జిల్లాకు చెందిన కొండబాబును అరెస్ట్ చేశామన్నారు. వీరు కాకినాడలో విక్రయించేందుకు గంజాయి తీసుకొచ్చినట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నట్లు వారు తెలిపారు.
Similar News
News October 14, 2024
ఆత్రేయపురం: నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు
ఆత్రేయపురం మండలంలో ఈ నెల 11న ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికను రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక అమ్మమ్మకు చెప్పింది. ఈ నెల 12వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం శివను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ రాము తెలిపారు.
News October 14, 2024
అమలాపురం: 133 మద్యం షాపులకు 4,087 దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్‌లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.
News October 14, 2024
అమలాపురం: 133 మద్యం షాపులకు 4,087 దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్‌లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.