News February 4, 2025
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం

కొత్తపల్లి మండలం నేమం గెస్ట్ హౌస్ సమీపంలో బీచ్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో పడిఉన్నారు. స్థానికుల వివరాల మేరకు.. సోమవారం వేగంగా వెళుతున్న ప్రగతి కాలేజ్ బస్సు రెండు బైక్లను ఢీకొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఉప్పాడకు చెందిన అబ్రాహాముగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను 108 లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
చెత్త రికార్డు.. టెస్టు చరిత్రలోనే తొలిసారి

యాషెస్ తొలి టెస్టులో చెత్త రికార్డు నమోదైంది. వరుసగా మూడు ఇన్నింగ్సుల్లో ఒక్క రన్ చేయకుండా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. టెస్టు చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులో జాక్ క్రాలే, AUS తొలి ఇన్నింగ్స్లో వెదరాల్డ్ డకౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో ENG: 172/10, AUS: 132/10 రన్స్ చేశాయి. రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లకు ENG 104 పరుగుల ఆధిక్యం(64/1)లో కొనసాగుతోంది.
News November 22, 2025
లొంగుబాటు.. చొక్కారావు, రాజిరెడ్డిలు ఉంటారా..?

ఉమ్మడి కరీంనగర్కు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేతలు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ ఇవాళ రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. చొక్కారావు దండకారణ్య కమిటీ మెంబర్గా విధులు నిర్వర్తిస్తుండగా, రాజిరెడ్డి రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరితోపాటు మరో 37మంది మావోలు వనం నుంచి జనంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
News November 22, 2025
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.


