News February 4, 2025

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం

image

కొత్తపల్లి మండలం నేమం గెస్ట్ హౌస్ సమీపంలో బీచ్ రోడ్‌లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో పడిఉన్నారు. స్థానికుల వివరాల మేరకు.. సోమవారం వేగంగా వెళుతున్న ప్రగతి కాలేజ్ బస్సు రెండు బైక్‌లను ఢీకొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఉప్పాడకు చెందిన అబ్రాహాముగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను 108 లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 7, 2025

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. BJPకే జైకొట్టిన మరో 2 సంస్థలు

image

ఢిల్లీలో ఈసారి BJP తిరుగులేని విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. నిన్న రాత్రి సర్వే ఫలితాలు వెల్లడించిన టుడేస్ చాణక్య, CNX కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. ఆ పార్టీ 51 సీట్లు గెలిచే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేయగా, 49-61 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని CNX పేర్కొంది. కాగా BJP 45-55 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని నిన్న సాయంత్రం మై యాక్సిస్ ఇండియా తెలిపింది.

News February 7, 2025

విజయవాడ: ఆ ప్రాంతాల్లో 6 రైళ్లు రద్దు

image

విజయవాడ రైల్వే డివిజన్‌లో నాన్ ఇంటర్ ల్యాకింగ్ పనులు నిమిత్తమై పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. RJY-VJA (67261), (67201) VJA-RJY (67262), (67201), KKD పోర్ట్-VJA (17257), VJA-KKD పోర్ట్ (17257) శనివారం రద్దు అవుతాయన్నారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు. 

News February 7, 2025

తిరుపతి: 66 ఉద్యోగాలకు దరఖాస్తులు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికగా ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా హాస్పిటల్, పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్‌లలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. 19 విభాగాలలో .. 66 ఖాళీలు ఉన్నట్లు సూచించారు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22.

error: Content is protected !!