News March 29, 2024
కాకినాడలో ట్రాఫిక్ ఎస్సైపై యువకుల దాడి

కాకినాడలోని ఉప్పలంక వద్ద వాహన తనిఖీలు చేస్తోన్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్‌పై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకొని కరప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.

నిడదవోలు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్‌లో జరిగే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.