News April 15, 2025
కాకినాడలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

కాకినాడ జిల్లా పరిషత్ కేంద్రం పూర్తిగా ఆక్రమణలకు గురైంది. ఈ ఆక్రమణలపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం ట్రాఫిక్ సీఐ నూని రమేష్ స్పందించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి మొత్తం ఆక్రమణలు తొలగించారు. జిల్లా పరిషత్ వద్ద షాపులు బయట పెట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్న విషయాన్ని గుర్తించి వాటిని పూర్తిగా తీసివేశారు. మరోసారి ఆక్రమిస్తే జరిమానాలు విధిస్తామని సీఐ రమేష్ హెచ్చరించారు.
Similar News
News November 17, 2025
MNCL: బైక్ చక్రంలో చీరకొంగు ఇరుక్కొని మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. MNCL జిల్లా వేమనపల్లికి చెందిన లత(35) తమ్ముడు అరుణ్ బైక్ పై GDK నుంచి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో తన చీర కొంగు వెనుక వీల్లో ఇరుక్కుపోవడంతో ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా లత అక్కడికక్కడే మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 17, 2025
గోదావరిఖని: బైక్ టైర్లో చీర ఇరుక్కుని మహిళ మృతి

GDKలోని గోదావరి నది బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మంచిర్యాల(D) వేమనపల్లికి చెందిన పుష్పలత GDK నుంచి తన గ్రామానికి తమ్ముడు అరుణ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుంది. ఈ క్రమంలో బ్రిడ్జ్ వద్ద తన చీర కొంగు బండి వెనుక టైర్లో ఇరుక్కుపోవడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో పుష్పలత అక్కడికక్కడే మరణించగా అరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
News November 17, 2025
భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్‌లో HR మేనేజర్‌గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ వర్క్‌ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్‌లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.


