News December 6, 2024
కాకినాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 14 మందికి జైలు శిక్ష
కాకినాడలో 42 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. నిందితులను కాకినాడ మూడో స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వి.నరసింహారావు ముందు హాజరుపరిచారు. వారిలో 14 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. 28 మందికి రూ.10 వేలు చొప్పున రూ.2,80,000 జరిమానా వేశారు.
Similar News
News January 22, 2025
అల్లవరం: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ అల్లవరం మండలం గోడిబాడవకు చెందిన సిర్రా సందీప్(5) మంగళవారం మృతి చెందాడు. ఎస్సై హరీశ్ కుమార్ కథనం.. అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్‌ను పేరెంట్స్ దుర్గాప్రసాద్, శిరీష బైక్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా గోడిలంక శ్మశాన వాటిక సమీపంలో కుక్క అడ్డురావడంతో కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News January 22, 2025
రాజమండ్రి: ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడు అదృశ్యం
ఉద్యోగం చూసుకుంటానని విశాఖపట్నం వెళ్లిన తన కుమారుడు ఇప్పటివరకు తిరిగిరాలేదని హుకుంపేట గ్రామానికి చెందిన రేలంగి శ్రీనివాసరావు మంగళవారం బొమ్మూరు పోలీసులకు పిర్యాదు చేశారు. తన 22ఏళ్ల రేలంగి దేదీప్ బిటెక్ పూర్తిచేశాడు. గత నెల 20వతేదీన ఉద్యోగం చూసుకుంటానని విశాఖపట్నం వెళ్లాడు. అయితే కొద్దిరోజులుగా అతనిఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
News January 22, 2025
రాజమహేంద్రవరం: పెళ్లి పేరుతో మోసం.. అధ్యాపకుడిపై కేసు
పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన అధ్యాపకుడు సురేశ్ కుమార్‌పై కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ రాము మంగళవారం తెలిపారు. రాజమహేంద్రవరం కొంతమూరుకు చెందిన యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామన్నారు. పెళ్లి పేరు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తనకు ఇంతకుముందే పెళ్లయిందని సమాధానం చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.