News January 30, 2025
కాకినాడలో నడిరోడ్డుపై గుర్తు తెలియని మృతదేహం

కాకినాడ నగరంలోని సంజీవ నగర్ ఏఎంజీ స్కూల్ సెంటర్ ఎదురుగా గురువారం ఉదయం టిడ్కో బిల్డింగ్స్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అతను ఎవరనేది తెలియలేదు.
Similar News
News February 8, 2025
జైనూర్: పనులను వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

జిల్లాలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జైనూర్ మండలం పట్నాపూర్‌లో కొనసాగుతున్న సీఎస్‌సీ నిర్మాణ పనులను పరిశీలించి నిర్దేశిత సమయంలోగా పూర్తిచేసే విధంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 8, 2025
మందమర్రి: MLC అభ్యర్థిగా సత్యనారాయణ నామినేషన్

ఉమ్మడి ఆదిలాబాద్,మెదక్, కరీంనగర్,నిజామాబాద్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకుడు పెద్దపల్లి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో శాసనమండలి రిటర్నింగ్ అధికారి పమేల సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం, బీసీ సంఘం నాయకులు రాంబాబు, రవీందర్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.
News February 8, 2025
పలు ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే పరిశుభ్రంగా ఉండే బోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాల ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.