News April 4, 2024

కాకినాడలో బాలికపై ఇద్దరి వ్యక్తుల అత్యాచారం

image

కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఏడో తరగతి చదువుకుని ఇంటి వద్దనే ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన బలసాడి జగదీశ్, కొప్పనాతి వీరబాబు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి అని డాక్టర్లు నిర్ధారించారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

Similar News

News March 15, 2026

ఏలూరు జిల్లాలో డ్యామ్‌లో మునిగి దేవరపల్లి వాసుల మృతి

image

దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డ్యామ్‌లో మునిగి మరణించారు. గల్లంతైన వారిని తుమ్మల నాగరాజు, రమణగా గుర్తించారు. పోలీసుల వివరాలు.. గుబ్బల మంగమ్మ ఆలయంకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దు- కలెక్టర్

image

గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఒకేసారి ఎక్కువ బుకింగ్‌లు చేయవద్దని, అవసరమైనప్పుడే సిలిండర్లు తీసుకోవాలని కోరారు. వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా ఇంటి నుండే సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, ఆయిల్ కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.