News October 30, 2024
కాకినాడలో విషాదం.. తల్లీకుమార్తెలు మృతి

తల్లి అనారోగ్య పరిస్థితులను చూడలేక కుమార్తె తల్లికి ఉరేసి అనంతరం తాను ఉరేసుకున్న ఘటన కాకినాడలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలానికి చెందిన తల్లీకుమార్తెలు సరస్వతి, స్వాతి 12 ఏళ్లుగా కాకినాడలో ఉంటున్నట్లు చెప్పారు. మృతదేహాలు పాడైపోయి ఉండటంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI నాగదుర్గారావు తెలిపారు.
Similar News
News July 7, 2025
రాజమండ్రి: ఈ నెల 12 వరకు రాబిస్ వ్యాధి నివారణ డ్రైవ్

జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5- 12వ తేదీ వరకు రాబిస్ వ్యాధి నివారణ డ్రైవ్ నిర్వహించినట్లు DMHO వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమండ్రిలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిల్లో 12వ తేదీ వరకు ఉచితంగా రాబిస్ వ్యాక్సిన్ అందిస్తారన్నారు. కుక్క కాటుకి గురైన వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు వ్యాక్సిన్‌తో రాబిస్ నుంచి రక్షణ పొందవచ్చు అన్నారు.
News July 7, 2025
రాజమహేంద్రవరం: నేడు యథావిధిగా పీజీఆర్ఎస్

నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా కలెక్టరేట్లో జరుగుతుందని జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమస్యలపై ఫిర్యాదులను అందించేందుకు వాట్సాప్ గవర్నెస్ నంబర్ 95523 00009 ద్వారా పౌర సేవలు పొందవచ్చు అన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సోమవారం పీజిఆర్ఎస్ ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వినతుల స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చున్నారు.
News July 6, 2025
రాజమండ్రి : ప్రయాణికులకు గమనిక

ఆషాఢ మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏ.సీ బస్సు ధరలో 15% రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ డీఎం కె.మాధవ తెలిపారు. నేడు ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. రాజమండ్రి – హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ తక్కువ ధరకు ఇంద్ర ఏ.సీ బస్సులో ప్రయాణించ వచ్చుని అన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుత టిక్కెటు ధర రూ.1060లు కాగా రాయితీపై ధర రూ.920గా ఉందని చెప్పారు.