News February 1, 2025

కాకినాడలో వృద్ధ దంపతులు ఆత్మహత్య

image

కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ఎం.ఆదిమూర్తి(65), ధనలక్ష్మి(60) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి పిల్లలు విదేశాల్లో ఉంటుండగా ఇక్కడ వారిద్దరే ఉంటున్నారు. అనారోగ్య సమస్యలున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని మనోవేదనకు గురై శుక్రవారం సాయంత్రం ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాలను వెలికితీయించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 3, 2025

అనంతగిరి కొండల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి

image

అనంతగిరి కొండల్లో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అటవీ సంరక్షణ చార్మినార్ జోన్ అధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. బుధవారం అనంతగిరి కొండల్లో ఎకో టూరిజం అభివృద్ధి పనులను కొండపై అటవీ శాఖ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను, నాటిన మొక్కలను పరిశీలించారు. అడవుల సంరక్షణతో పాటు పర్యాటకులకు అనంతగిరి కొండపై సౌకర్యాలు కల్పించే అభివృద్ధి చేయాలన్నారు.

GNT: ఆ వ్యాధికి.. డీఎంహెచ్ఓ సూచనలు

image

స్క్రబ్ టైఫస్ట్ అనేది జూనోటిక్ వ్యాధి అని, ఓరియన్షియా సుసుగముషి అనే పేడ పురుగు బ్యాక్టీరియాతో వ్యాధి సంక్రమిస్తుందని DMHO విజయలక్ష్మీ తెలిపారు. శరీరం పై నల్లమచ్చల దద్దర్లు,జ్వరం,తలనొప్పి,వణుకు, కండరాల నొప్పులు వ్యాధి లక్షణాలన్నారు. వ్యాధి నిర్థారణ పరీక్ష గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉందన్నారు. శరీరాన్ని పూర్తిగా దుస్తులతో కప్పి ఉంచడం, పొలం పనులు చేసే వారు రబ్బరు బూట్లు ధరించాలన్నారు.