News February 1, 2025

కాకినాడలో వృద్ధ దంపతులు ఆత్మహత్య

image

కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ఎం.ఆదిమూర్తి(65), ధనలక్ష్మి(60) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి పిల్లలు విదేశాల్లో ఉంటుండగా ఇక్కడ వారిద్దరే ఉంటున్నారు. అనారోగ్య సమస్యలున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని మనోవేదనకు గురై శుక్రవారం సాయంత్రం ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాలను వెలికితీయించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2025

కడప: 36 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

image

కడప జిల్లా సిద్దవటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987 – 88 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. అప్పటి ఉపాధ్యాయులను వారు శాలువులతో ఘనంగా సత్కరించారు. గతంలో పాఠశాలలో తాము గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అందరము కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలా మీ బ్యాచ్‌తో మీరు కలిశారా?.

News February 9, 2025

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్ రాజకుమారి

image

సంక్షేమ వసతి గృహాలలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి విద్యార్థులకు ఉద్బోధించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బొమ్మల సత్రంలోని బాలికల వసతి గృహంలో ప్రతి విద్యార్థినికి పదో తరగతి పరీక్షలు రాయడానికి అవసరమైన మెటీరియల్స్‌ను కలెక్టర్ అందజేశారు.

News February 9, 2025

పార్వతీపురం: మద్యం షాపుల లాటరీ వాయిదా

image

సోమవారం నిర్వహించనున్న మద్యం షాపుల లాటరీ విధానాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరుగనున్న కారణంగా ఎలక్షన్ కోడ్ నిబంధన మేరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశాలతో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!