News August 19, 2024
కాకినాడ: అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి దుర్మరణం
కాకినాడ జిల్లాలో రాఖీ పండగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడలోని దుమ్ములపేటలో అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి మృత్యువాత పడింది. యు.కొత్తపల్లి మండలం కోనపాపపేట సమీపంలోని కొత్తమూలపేట వద్ద ప్యాసింజర్ ఆటోను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉప్పరపల్లి దేవి(11) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలోని మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు
Similar News
News September 11, 2024
హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తాం: చంద్రబాబు
వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్‌కు రూ. 25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 65 వేల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఏలేరు రిజర్వాయర్‌కు అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయని చెప్పారు.
News September 11, 2024
దేవరపల్లి యాక్సిడెంట్.. CM తీవ్ర దిగ్భ్రాంతి
తూ.గో. జిల్లా దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News September 11, 2024
కోనసీమ: 9 ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం
రాజోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికపై సత్యనారాయణ (72) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక సోదరి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదుచేసినట్లు రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 7న బాలిక ఆడుకుంటుండగా నిందితుడు చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియవేసి అత్యాచారానికి ప్రయత్నించాడన్నారు. పిల్లలు తలుపు కొట్టడంతో పారిపోయాడన్నారు.