News August 12, 2024

కాకినాడ అబ్బాయిని మోసం చేసిన ఆరుగురు మహిళలు

image

కాకినాడ జిల్లాకేంద్రంలోని పెద్దమార్కెట్‌కు చెందిన టి.కృష్ణమోహన్‌ను పెళ్లిసంబంధం పేరిట ఆరుగురు మహిళలు కలిసి కొద్దిరోజుల క్రితం <<13794340>>మోసం <<>>చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై గతంలోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేయగా ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ రోజు బాధితుడు కలెక్టరేట్‌లో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలోనూ ఫిర్యాదుచేశాడు.

Similar News

News September 19, 2024

తూ.గో: కూటమి 100 రోజుల పాలనపై మీ కామెంట్?

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. జిల్లాలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మీ ఎమ్మెల్యే పనితీరుపై కామెంట్ చేయండి.

News September 19, 2024

రాజమండ్రిలో పలు రైళ్లకు హాల్ట్ కల్పించిన ద.మ రైల్వే

image

కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో కోవిడ్ సమయంలో నిలిపి వేసిన పూరి-తిరుపతి, బిలాస్ పూర్-తిరుపతి మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొవ్వూరులో హాల్ట్ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి-పూరీల మధ్య ఎక్స్ ప్రెస్ ఐదు రోజులు, బిలాస్ పూర్-తిరుపతి మధ్య రెండు రోజులు రైలు నడుస్తున్నాయి. భువనేశ్వర్ రామేశ్వరం పుదుచ్చేరి-హౌరాల మధ్య ప్రయాణిస్తున్న వారాంతపు ఎక్స్ ప్రెస్‌లకు రాజమండ్రిలో హాల్ట్ కల్పించారు.

News September 19, 2024

ఉండ్రాజవరం: కత్తెరతో భర్తను హత్య చేసిన భార్య

image

ఉండ్రాజవరం మండలం శివారు రెడ్డి చెరువులో శ్రీనివాసరావు (41) పై భార్య రాణి కత్తెరతో దాడి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అనుమానంతో భార్యని నిలదీయడంతో రెండు నెలల నుంచి వీరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై ఘర్షణ తలెత్తడంతో మంగళవారం రాత్రి రాణి తన భర్త గుండెల్లో కత్తెరతో పొడవగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.