News September 30, 2024
కాకినాడ: ‘అమ్మ నన్ను ట్రైన్ ఎక్కించి వాటర్ కోసం వెళ్లి రాలేదు’

బెంగళూరు రైల్వే స్టేషన్లో ఓ తల్లి వాటర్ బాటిల్ కోసం దిగగా.. ఆమె 14ఏళ్ల కుమార్తె కాకినాడకు చేరింది. RPF పోలీసులు కాకినాడలో ఆ బాలికను గమనించి వివరాలు సేకరించారు. ‘బెంగళూరు వైట్‌ఫీల్డ్ స్టేషన్లో అమ్మ నన్ను రైలు ఎక్కించి వాటర్ బాటిల్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఈ లోగా రైలు కదలడంతో కాకినాడ చేరా’నని పేర్కొంది. బాలిక వివరాలు చెప్పలేకపోతుందని, సఖీ, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు అప్పగించామని తెలిపారు.
Similar News
News September 18, 2025
మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.
News September 18, 2025
పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: వీసీ

యూజీసీ నెట్, జేఆర్ఎఫ్, సీఎస్ఐఆర్ నెట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడవచ్చని సూచించారు.
News September 18, 2025
రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.