News February 2, 2025
కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
కడప ఫాతిమా వైద్య కళాశాలలోని హాస్టల్లో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మన్సూరీ ఖాన్ (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలోకి వెళ్తే.. కాకినాడకు చెందిన మన్సూరీ ఖాన్ భార్య పిల్లలతో రెండేళ్ల క్రితం కడప వలస వెళ్లారు. ఆర్థిక సమస్యలతో హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలను బాగా చూసుకోమని భార్య ఫారియాకు చెప్పాడు. అనంతరం ఉరేసుకుని చనిపోయాడు.
Similar News
News February 2, 2025
కల్వకుర్తి: కునుకు తీసిన గుడ్లగూబ
కల్వకుర్తి పట్టణం గాంధీనగర్ కాలనీలోని ఓ దుకాణం వద్ద ఓ గుడ్లగూబ ఆదివారం కునుకు తీస్తూ కనిపించింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిద్రపోతున్న గుడ్లగూబను కాలనీ ప్రజలు, అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు. అడవిలో ఉండే ఈ పక్షి కాంక్రీట్ జంగిల్‌గా మారిన పట్టణంలో కునుకు తీస్తూ కనిపించటంతో ఆసక్తి నెలకొంది. ఈ గుడ్లగూబను పలువురు కెమెరాలో బంధించారు.
News February 2, 2025
షాద్‌నగర్‌కు పండ్ల మార్కెట్ వస్తుందా?
షాద్‌నగర్ పట్టణంలో పండ్ల మార్కెట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ మామిడి, సీతాఫలం, జామ తోటలు అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ దిగుబడులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. కానీ పండ్ల మార్కెట్ లేక రోడ్ల మీదే అమ్మకాలు కొనసాగిస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అమ్మకాల కోసం పట్టణ శివారులో వేసిన షెడ్ శిథిలమైపోయింది. మామిడి సీజన్ వస్తున్నందున వెంటనే పండ్ల మార్కెట్ నిర్మించాల్సిన అవసరం ఉంది.
News February 2, 2025
రూ.12,500 కోట్లు తిరిగివ్వనున్న రక్షణ శాఖ.. ఎందుకంటే
గత ఏడాది బడ్జెట్లో తమకు చేసిన కేటాయింపుల్లో రూ.12,500 కోట్లను రక్షణ శాఖ కేంద్రానికి తిరిగివ్వనుంది. డిఫెన్స్ డిపార్ట్మెంట్ చేపట్టిన పలు కొనుగోళ్లు వివిధ కారణాలతో జాప్యం కావడంతో వాటి కోసం కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. ఆ నిధుల్ని ప్రభుత్వానికి తిరిగిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ శాఖకు కేంద్రం కేటాయించింది.