News February 2, 2025
కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

కడప ఫాతిమా వైద్య కళాశాలలోని హాస్టల్లో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మన్సూరీ ఖాన్ (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలోకి వెళ్తే.. కాకినాడకు చెందిన మన్సూరీ ఖాన్ భార్య పిల్లలతో రెండేళ్ల క్రితం కడప వలస వెళ్లారు. ఆర్థిక సమస్యలతో హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలను బాగా చూసుకోమని భార్య ఫారియాకు చెప్పాడు. అనంతరం ఉరేసుకుని చనిపోయాడు.
Similar News
News February 16, 2025
పన్నుల వసూళ్లలో హుజూరాబాద్ రెండో స్థానం

ఇంటి పన్నుల వసూళ్లలో HZB మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గతంలో వసూళ్లలో 5వ స్థానంలో ఉన్నదానిని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సహకారంతో రూ.2.03కోట్లు వసూలుచేసి, 76.95శాతం వసూళ్లతో రికార్డు సాధించగలిగామన్నారు. మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను కట్టేవారు 9,431 మంది ఉన్నారన్నారు. ఉద్యోగులు, ప్రజల సహకారంతో రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేస్తున్నామన్నారు.
News February 16, 2025
ఆ లోపే బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక: కిషన్ రెడ్డి

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
News February 16, 2025
HYDలో ప్రేమికుల రోజు LOVER సూసైడ్

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్‌నగర్ పోలీసుల వివరాలు.. PSపరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్‌పై కోపంతో తన కూతురిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయించాడు. ఈ మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకున్నాడు. వాలంటైన్‌డే రోజు ఇలా జరగడం స్థానికంగా విషాదం నింపింది.