News March 12, 2025

కాకినాడ: ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

image

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రెగ్యులర్‌గా 22,579 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 21,694 మంది హాజరయ్యారు. 885 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్ అధికారి నూకరాజు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో 1,748 మందికి గాను 1,612 మంది హాజరయ్యారని, 136 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. అన్ని సెంటర్లలో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.

Similar News

News March 21, 2025

అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

image

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.

News March 21, 2025

రైలు నుంచి జారిపడి బిక్కవోలు వాసి మృతి

image

భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గురువారం జారిపడి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా బిక్కవోలుకు చెందిన అంబటి సుబ్బా రెడ్డి (69) సింహాద్రి రైల్లో రాజమండ్రి వైపు వెళుతున్న సమయంలో జారిపడి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

News March 21, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

image

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే, జూన్ 9- 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు సంబంధించి టికెట్లు ఉ.11 గంటలకు రిలీజ్ అవుతాయి. వీటితో పాటు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటా టోకెన్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.

error: Content is protected !!