News August 29, 2024
కాకినాడ: ఈ నెల 30న జిల్లా స్థాయి వన మహోత్సవం
ఈ నెల 30న జిల్లా స్థాయి వన మహోత్సవం కార్యక్రమాన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించనున్నట్లు జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి బుధవారం తెలిపారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30న వనమహోత్సవం కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తు కాకినాడ జేఎన్టీయూలో వివిధ ప్రాంతాలతో కలిసి 3,000 మొక్కలు నాటుతున్నామని డీఎఫ్ఓ తెలిపారు.
Similar News
News September 13, 2024
హత్యాయత్నం కేసులో 18 ఏళ్లు జైలు శిక్ష
కాకినాడలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ చిన్నారావుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముద్దాయి దుర్గాప్రసాద్ కు 18 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కాకినాడ రెండవ అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ విజయబాబు గురువారం తీర్పు చెప్పారు. 2023 మార్చి 17వ తేదీన హత్యాయత్నానికి పాల్పడ్డా ఘటనలో అప్పట్లో కేసు నమోదు చేశారు. కేసులో నేరం రుజువు కావడంతో జడ్జ్ శిక్ష విధించారని సీఐ అప్పలనాయుడు తెలిపారు.
News September 12, 2024
అంబాజీపేట: దారికాచి దోపిడి చేస్తున్న హిజ్రాలు.. కేసు నమోదు
దారికాచి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు హిజ్రాలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు చేనేత కాలనీకి చెందిన రాజేంద్రప్రసాద్ అమలాపురం నుంచి వస్తుండగా చింతాలమ్మ ఆలయం వద్ద ఇద్దరు హిజ్రాలు డబ్బుల కోసం ఆపారన్నారు. డబ్బులు లేవని చెప్పగా జేబులో నుంచి రూ.4వేలు లాక్కొని మరో వ్యక్తి సాయంతో పారిపోయారన్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
News September 11, 2024
హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తాం: చంద్రబాబు
వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్‌కు రూ. 25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 65 వేల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఏలేరు రిజర్వాయర్‌కు అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయని చెప్పారు.