News February 22, 2025

కాకినాడ: ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు తరలింపు

image

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాకినాడలో మెక్లారిన్ హై స్కూల్, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఏలూరు కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి శుక్రవారం తెలిపారు. 26వ తేదీన ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఎన్నికల పోలింగ్ సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేస్తామన్నారు.

Similar News

News November 21, 2025

కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.

News November 21, 2025

సెలవులో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్

image

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సెలవు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి సొంత రాష్ట్రమైన పంజాబ్ వెళ్లారు. ఈ నెల 26న తిరిగి గుంటూరు వచ్చి మరుసటి రోజు అంటే 27న ఎస్పీ వకుల్ జిందాల్ విధుల్లోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావును పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా నియమించారు.

News November 21, 2025

నేడు కామారెడ్డిలో జాబ్ మేళా

image

నిరుద్యోగుల కోసం ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమర్ తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 6300057052, 7671974009 నంబర్లను సంప్రదించాలన్నారు.