News February 27, 2026

కాకినాడ: ఒకరోజు ముందుగానే పింఛన్

image

మార్చి నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే 28న జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తామని కలెక్టర్ షాన్‌మోహన్ గురువారం తెలిపారు. 2.68 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 117.02 కోట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నాడే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Similar News

News April 12, 2026

తిరుమల దర్శనం టికెట్ల విడుదల తేదీలు ఇవే..!

image

తిరుమల జులై నెల దర్శన టోకెన్ల విడుదల తేదీలను TTD ప్రకటించింది. ఏప్రిల్ 18న ఉ.10 గంటలకు ఆర్జిత సేవల టికెట్లు విడుదలవుతాయి. ఏప్రిల్ 20 వరకు ఎలక్ట్రానిక్ డిప్‌ నమోదు చేసుకోవాలి. 20-22 వరకు చెల్లింపులు చేయాలి. ఏప్రిల్ 21న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆరోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, ఏప్రిల్ 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి, వృద్ధులు–దివ్యాంగుల దర్శన టోకెన్లు, ఏప్రిల్ 24న రూ.300 టికెట్లు, గదుల కోటా విడుదలవుతుంది.

News April 12, 2026

హార్ముజ్‌లో టెన్షన్.. పాక్ ట్యాంకర్ యూటర్న్

image

హార్ముజ్ జలసంధి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాయి. పాక్, ఇరాక్‌కు చెందిన ఈ నౌకలు ఒమన్ గల్ఫ్ నుంచి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ దగ్గరకు రాగానే వెనక్కి వెళ్లాయి. నిజానికి పాక్, ఇరాక్ నౌకలకు తొలుత ఇరాన్ అనుమతి ఇచ్చింది. కానీ చర్చలు ఫెయిల్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

News April 12, 2026

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గుత్తి విద్యార్థి సత్తా

image

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో గుత్తికి చెందిన మీసేవ నిర్వాహకుడు సురేశ్ కుమారుడు సుజిత్ కుమార్ సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న సుజిత్ కుమార్.. ఎంపీసీలో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించాడు.