News March 16, 2025
కాకినాడ: కన్నతండ్రే కిల్లర్‌లా చంపేశాడు..!

కన్నతండ్రే కిల్లర్‌లా ఇద్దరు చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. చంద్రకిశోర్ ఇద్దరి చిన్నారులను ప్రముఖ స్కూల్‌లో చదివిస్తున్నాడు. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా? అనే భయం మొదలైందని బంధువులు చెబుతున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలకు కాళ్లుచేతులకు తాళ్లు ఎలా కట్టగలిగాడు? వారిని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఎలా చంపగలిగాడనేది అనుమానంగా ఉందని వారు చెప్పారు.
Similar News
News December 6, 2025
నాగర్ కర్నూల్: అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల వారం రోజులపాటు చలి తీవ్రత తగ్గినప్పటికీ రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలి పెరిగింది. శనివారం వెల్దండలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తోటపల్లి 14, కల్వకుర్తి 14.4, బిజినపల్లిలో 14.7 డిగ్రీలు నమోదయ్యాయి.
News December 6, 2025
నిర్మల్: ముగిసిన మూడవదశ నామినేషన్ ప్రక్రియ

నిర్మల్ జిల్లాలో మూడవ దశ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఐదు మండలాల్లో మొత్తం 714 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ డీపీఓ ప్రకటనలో తెలిపారు. చివరి రోజు అత్యధికంగా కుబీర్ మండలంలో 116 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఐదు మండలాల్లో 133 సర్పంచ్ స్థానాలకు 714 మంది పోటీ పడుతున్నారు.
News December 6, 2025
నిజమైన భక్తులు ఎవరంటే?

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>


