News April 5, 2024
కాకినాడ: కన్నీటి ఘటన
గండేపల్లిలో జరిగిన <<12990018>>రోడ్డు ప్రమాదంలో<<>> హనుమాన్ జంక్షన్‌కు చెందిన సుబ్రహ్మణ్యం(42), రంగారెడ్డి జిల్లాకు చెందిన చేకూరి పల్లయ్య చౌదరి(52) మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. ‘బావ అన్నవరం రమ్మంటున్నాడు వెళ్లకపోతే బాగోదమ్మా అంటూ కారులో వెళ్లొస్తామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా’ అంటూ సుబ్రహ్మణ్యం తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News January 20, 2025
మారేడుమిల్లి ‘గుడిసె’ ప్రవేశానికి రేట్లు ఇవే
ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి మండలంలోని గుడిసె హిల్ స్టేషన్‌కు వెళ్లేందుకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన టోల్ గెట్‌లో చెల్లించవలసిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఫోర్ వీలర్‌కు రూ. 300, టు వీలర్‌కు రూ. 100, ప్రతీ వ్యక్తికి రూ. 100 ప్రవేశ రుసుము చెల్లించాలి. వీడియో కెమెరాకు రూ.1000, డ్రోన్ కెమెరాకు రూ. 2000 చెల్లించాలి. నిబంధనలు అతిక్రమిస్తే రూ. 500 ఫైన్ పడుతుందని అధికారులు తెలిపారు.
News January 19, 2025
ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన రాజామని శివ (22)పేరవరం నుంచి తుని పంక్షన్‌కు వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
News January 19, 2025
కూనవరం: ఆదివాసీల సామూహిక చేపల వేట
కూనవరం మండలం చిన్నారుకుర్ పెద్ద చెరువులో ఆదివారం ఆదివాసీలు సామూహిక చేపల వేట నిర్వహించారు. సంక్రాంతి తర్వాత సంప్రదాయంగా చేపల వేట చేస్తామన్నారు. నాలుగు మండలాల నుంచి 3000 మంది చిన్నా ,పెద్దా తేడా లేకుండా ఆదివాసీ పెద్దల సమక్షంలో చేపల వేట సాగించారు. గ్రామ పెద్దలు బంధువులు అందరికీ కబురు పెట్టి వారి సమక్షంలో వయసుతో నిమిత్తం లేకుండా ఈ వేట సాగిస్తారన్నారు.