News January 26, 2025
కాకినాడ కలెక్టర్‌కు ఉత్తమ ఎన్నికల అధికారి పురస్కారం

కాకినాడ కలెక్టర్ ఎస్ ఎస్ మోహన్ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా పురస్కారం అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతులమీదుగా ఉత్తమ ఎన్నికల అధికారిగా ఆయన అవార్డు స్వీకరించారు. అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవలు అందిస్తామన్నారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, అర్బన్ తాహశీల్దార్‌లకు అవార్డులు దక్కాయి.
Similar News
News December 23, 2025
అమరావతి బ్రాండ్‌కు ఊపిరి.. ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం

అమరావతి బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో AP ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా పర్యాటక శాఖ సరికొత్త సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ఆవకాయ’ అనే వినూత్న పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా వేడుకలు నిర్వహించనుంది.
News December 23, 2025
నాడు ఊరిలో సఫాయీ.. నేడు ఊరికే సర్పంచ్

TG: నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాలకి చెందిన మిరేకర్ మాధవ్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. 19 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆయన పోటీ చేసి గెలుపొందారు. నిన్న మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సఫాయీ కార్మికుడిగా ఉన్న తనను సర్పంచ్ చేసిన గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు.
News December 23, 2025
నగరిలో టీడీపీ నేత అక్రమాలు: YCP

నగరి ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత భారీగా రేషన్ అక్రమ రవాణా చేశారని వైసీపీ ఆరోపించింది. నిండ్రలోని నెట్టేరి వద్ద తనిఖీల్లో 4 టన్నుల రేషన్ బియ్యంతో టీడీపీ ఎస్సీ సెల్ నేత అల్లిముత్తు పట్టుబడినట్లు తెలిపింది. తర్జనభర్జనల తర్వాత అల్లిముత్తు , కార్తీక్ , విక్రమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించింది.


