News March 4, 2025
కాకినాడ: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.
Similar News
News March 21, 2025
అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్

అక్రమ వలసదారుల కోసం CBP హోమ్ యాప్ తీసుకొచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ యాప్‌ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశానికి వెళ్లవచ్చని తెలిపారు. అలా వెళ్లడం ద్వారా తరువాతి కాలంలో లీగల్‌గా అమెరికాకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా అక్రమంగా ఉండి ప్రభుత్వానికి పట్టుబడితే వారిని అమెరికా నుంచి బహిష్కరించడంతో పాటు దేశంలోకి మరోసారి ప్రవేశముండదని ట్రంప్ హెచ్చరించారు.
News March 21, 2025
EPFO నూతన ఉద్యోగుల వివరాలు తెలిపిన కార్మిక శాఖ

ఈ ఏడాది జనవరిలో ఈపీఎఫ్‌ఓలో నికరంగా 17.89లక్షల మంది నూతన చందాదారులు చేరినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 11.47శాతం అధికమని తెలిపింది. కొత్తగా చేరిన వారిలో18-25 ఏళ్లవారు దాదాపు 4.7 లక్షలమంది ఉన్నారు. జనవరిలో కొత్తగా చేరిన మహిళా సభ్యులు 2.17 లక్షల మంది ఉండగా గతేడాదితో పోలిస్తే 6.10 శాతం పెరిగారు.
News March 21, 2025
శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు ఫ్యామిలీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మంత్రి లోకేశ్‌తో సహా కుటుంబసభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు.