News February 3, 2025
కాకినాడ: క్రీడా పోటీలు ప్రారంభం

గోదావరి టెన్నిస్ అసోసియేషన్, కాకినాడ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఛాంపియన్ షిప్ సిరీస్ – AITA అండర్ 16 పోటీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ పోటీలకు కావలసిన సహాయ సహకారాలు ఆయన అందిస్తానన్నారు.
Similar News
News December 17, 2025
వీణవంక సర్పంచ్గా దాసరపు సరోజన విజయం

వీణవంక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని దాసరపు సరోజన రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించారు. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచారు. తన గెలుపునకు సహకరించిన ఓటర్లందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో వీణవంకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా సరోజన హామీ ఇచ్చారు.
News December 17, 2025
మెస్సీకి అంబానీ గిఫ్ట్.. ఖరీదు ఎంతో తెలుసా?

అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ నిన్న గుజరాత్లోని <<18586214>>వనతార<<>>ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ అరుదైన బహుమతి ఇచ్చారు. రిచర్డ్ మిల్లీ RM 003 V2 వాచ్ను బహూకరించారు. దీని విలువ దాదాపు రూ.10.91 కోట్లు కావడం గమనార్హం. ఈ లిమిటెడ్ ఆసియా ఎడిషన్ వాచ్లు ప్రపంచంలో 12 మాత్రమే ఉన్నాయి. ‘గోట్ టూర్’లో భాగంగా ఈ నెల 13-16 తేదీల్లో ఇండియాలో మెస్సీ పర్యటించారు.
News December 17, 2025
భద్రాద్రి: ‘జగన్’పై ‘చంద్రబాబు’ విజయం

జూలూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయతీ ఎన్నిక ఫలితం జిల్లావ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ మద్దతుదారు చంద్రబాబు, తన సమీప ప్రత్యర్థి జగన్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లోని ప్రముఖ నాయకుల పేర్లతో ఉన్న అభ్యర్థులు ఇక్కడ తలపడటంతో ఈ పోరు మొదటి నుంచీ అత్యంత ఆసక్తికరంగా మారింది.


