News December 19, 2024

 కాకినాడ: ‘ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలు అందించాలి’

image

ఎస్సీ ఉప కులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలు అందించాలని ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పై ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా జిల్లా అధికారులను కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో గురువారం కాకినాడ కలెక్టరేట్‌లోని నాలుగు జిల్లాల ఎస్సీ ఉప కులాల వారీగా వారి స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు.

Similar News

News November 25, 2025

24 గంటల్లో ధాన్యం చెల్లింపులు తప్పనిసరి: మంత్రి నాదెండ్ల

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోపు రైతులకు చెల్లింపులు చేయాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ పనితీరు మెరుగుపడాలని సూచించారు.

News November 24, 2025

టెన్త్ పరీక్షల‌పై సందేహాలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్: DEO

image

2026 మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌ను ప్రధానోపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని డీఈవో కంది వాసుదేవరావు సూచించారు. పాఠశాల యూ-డైస్‌ డేటాతో సరిచూసుకుని, దోషరహితంగా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి కోసం జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఎం.అమలకుమారిని 9849939487 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.