News December 19, 2024
కాకినాడ: ‘ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలు అందించాలి’
ఎస్సీ ఉప కులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలు అందించాలని ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పై ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా జిల్లా అధికారులను కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో గురువారం కాకినాడ కలెక్టరేట్‌లోని నాలుగు జిల్లాల ఎస్సీ ఉప కులాల వారీగా వారి స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు.
Similar News
News January 18, 2025
కోరుకొండ నారసింహుని ఆలయంలో మద్యం, మాంసం
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ నారసింహుని ఆలయం ప్రాంగణంలో మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వ్యవహారం బయట వారి పనా.. లేక ఆఫీస్ సిబ్బంది పనా అంటూ ఉన్నతాధికారులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
News January 18, 2025
తూ.గో జిల్లాకు చివరి ర్యాంక్
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో వారి పనితీరు, పథకాల అమలు తదితర అంశాలపై ర్యాంకులు ఇచ్చినట్లు సమాచారం. అందులో ఉమ్మడి తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీల పనితీరుకు చివరి ర్యాంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.
News January 17, 2025
తూ.గో : బరువెక్కిన గుండెతో పయనం
తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.