News March 18, 2025

కాకినాడ: గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, బీసీ గృహాల లబ్ధిదారులకు అదనపు ఆర్దిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాకినాడ జిల్లా హౌసింగ్ పీడీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో గృహాల నిర్మాణంలో లబ్ధిదారులకు అదనంగా నిధులు మంజూరైన పత్రాలు అందజేశారు. బీసీలకు రూ.50,000, ఎస్టీలకు రూ.75,000 ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. కావున లబ్ధిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News March 19, 2025

వట్టిచెరుకూరు: చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం

image

బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో వృద్ధుడు. ఉమ్మడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో ఈ అమానుషం జరిగింది. సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.థామస్(55) ఇంటి పక్కనే ఉన్న చిన్నారిపై ఈ నెల 14న అత్యాచారం చేశాడు. అనారోగ్యంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. వృద్ధుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News March 19, 2025

చిత్తూరు: లంచం కోసం SI అరాచకం.. మహిళ మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

image

SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.

News March 19, 2025

ఉరుములు, మెరుపులతో వర్షాలు

image

TG: ఈ నెల 22న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD హైదరాబాద్ తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 21, 23న తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వివరించింది. ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

error: Content is protected !!