News January 30, 2025
కాకినాడ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు, పేరును ఇప్పటికే ప్రకటించారు.
Similar News
News November 15, 2025
తూప్రాన్: మహిళ ఆత్మహత్య

తూప్రాన్ పట్టణంలో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన బుట్టి అమృత (52) మానసిక స్థితి సరిగా లేక ఈనెల 12న క్రిమిసంహారక మందు తాగింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 15, 2025
iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.
News November 15, 2025
విజయవాడ: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

విజయవాడలోని సూర్యారావుపేట వద్ద గురువారం మధ్యాహ్నం సరస్వతి అనే మహిళను ఆమె భర్త విజయ్ హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కలహాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడు విజయ్ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ ఆలీ చెప్పారు. అతని వద్ద నుంచి రెండు పదునైన ఆయుధాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు.


