News March 19, 2024

కాకినాడ చరిత్రలో 1983లో అత్యధికం.. ఈ సారి ఛాన్స్ ఉందా.?

image

కాకినాడ పట్టణ నియోజకవర్గానికి 1952- 2019 వరకు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి మల్లాడిస్వామిపై అత్యధికంగా 55631 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాకినాడ సిటీ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. మళ్లీ అంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. మరి ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదైనా.. ఆ నాటి మెజారిటీని కొల్లగొట్టేనా..?

Similar News

News September 13, 2024

రంపచోడవరం: అనారోగ్యం‌తో లెక్చరర్ మృతి

image

రంపచోడవరం ఏపీ గిరిజన బాలికల గురుకుల కళాశాల ఇంగ్లీషు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.ఉషాకిరణ్(42) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. రాజమండ్రిలో నివాసం ఉంటూ కొంత కాలంగా ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని స్నేహితులు తెలిపారు. ఆమెకు భర్త, ఇరువురు పిల్లలు ఉన్నారు. గతంలో రాజవొమ్మంగి, బుట్టాయిగూడెం గురుకుల పాఠశాలల్లో పని చేశారని ఆమె మరణం జీర్ణించకోలేక పోతున్నామని తోటి ఉద్యోగులు తెలిపారు.

News September 13, 2024

పిఠాపురం: జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ ఎక్కిన అభిమాని

image

పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం YS జగన్ పర్యటన కొనసాగుతోంది. మాధవపురం గ్రామంలో బాధితులను కలిసేందుకు కాన్వాయ్ దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ ఎక్కాడు. అప్రమత్తమైన సిబ్బంది అతణ్ని అక్కడి నుంచి పంపించేశారు.

News September 13, 2024

తూ.గో.: నలుగురు SIలు ఏఎస్ఆర్ జిల్లాకు కేటాయింపు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఎస్ఐలను అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయిస్తూ ఏలూరు రేంజి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తూ.గో. జిల్లాకు చెందిన టి.శివకుమార్, కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన షరీఫ్, టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన చినబాబును ఏఎస్ఆర్ జిల్లాకు కేటాయించారు.