News March 7, 2025

కాకినాడ : చాలా ఘోరం కదా..?

image

చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ)చనిపోయాడు.

Similar News

News November 13, 2025

ఊట్కూర్: రూ.3.91కోట్ల అవకతవకలు.. ఐదుగురి అరెస్ట్

image

ఉట్కూర్‌లోని SBI బ్యాంక్‌లో 2016–2019 మధ్య నకిలీ పట్టా పాస్‌బుక్స్ ఆధారంగా 414 ఖాతాల్లో సుమారు రూ.3.91 కోట్లు మోసం చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బ్యాంక్ మేనేజర్‌ SR నాగరాజు, క్యాషియర్‌ మంత నరేష్‌, మధ్యవర్తులు పూడూరు సత్యనారాయణ, మలీ పటేల్ సోమిరెడ్డి, కుర్మిరెడ్డిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మరికొంతమంది ప్రమేయంపై విచారణ జరుగుతోందని CI తెలిపారు.

News November 13, 2025

TG TET షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News November 13, 2025

పచ్చిరొట్టగా పెసర/మినుముతో సాగుకు లాభం

image

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.