News August 26, 2024

కాకినాడ: చికిత్స పొందుతూ ముగ్గురు మృతి

image

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేరు వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం మృతి చెందారు. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన దొరబాబు (40), పెదపూడి మండలం కాండ్రేగులకు చెందిన శ్రీనివాస్ (47), సామర్లకోట మండలం అచ్చంపేటకు చెందిన త్రిమూర్తులు (38) ముగ్గురు వివిధ కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు.

Similar News

News December 12, 2024

తూ.గో జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన

image

సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత జగన్ ఉభయ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.

News December 12, 2024

పి.గన్నవరం: గల్లంతైన బాలుడు మృతదేహం లభ్యం

image

పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతా వారి పేట వద్ద పంట కాలువలో గల్లంతైన బాలుడు మృతదేహం బుధవారం లభ్యమైంది. మంగళవారం విహారయాత్ర ముగించుకుని కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు ఎగిరి పడ్డారు. ఇందులో నేలపూడి ఉమ (31), పెద్ద కుమారుడు రోహిత్ (9) మృతదేహాలు అదే రోజు లభ్యమయ్యాయైన విషయం తెలిసిందే. పోలీసులు మనోజ్ మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించారు.

News December 12, 2024

పి.గన్నవరం: గల్లంతైన బాలుడు మృతదేహం లభ్యం

image

పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతా వారి పేట వద్ద పంట కాలువలో గల్లంతైన బాలుడు మృతదేహం బుధవారం లభ్యమైంది. మంగళవారం ఉదయం గల్లంతైన మనోజ్ (5) మృతదేహం లభ్యం కావడంతో ముగ్గురు మృతదేహలు లభ్యమయ్యాయి. నేలపూడి ఉమ (31), పెద్ద కుమారుడు రోహిత్ (9) మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. విహారయాత్ర ముగించుకుని కారులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టనికి తరలించారు.