News March 23, 2024
కాకినాడ: జంటహత్యల కేసులో నిందితుడి అరెస్టు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో జంట హత్యల కేసులో నిందితుడైన లోకా నాగరాజును అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపర్చినట్లు పిఠాపురం CI శ్రీనివాస్ తెలిపారు. బుధవారం అదే గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాస్, పెండ్యాల లోవాలపై పొలంలోనే నాగబాబు కత్తితో దాడి చేసి, హత్య చేశాడన్నారు. అనంతరం లోవ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించాడని CI పేర్కొన్నారు.
Similar News
News September 8, 2024
తూ.గో.: 3 జిల్లాలకు DCC నూతన అధ్యక్షులు
తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు నూతనంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మద్దేపల్లి సత్యానందరావు నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా టీకే విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు.
News September 8, 2024
ఉమ్మడి తూ.గో. జిల్లా ఇన్‌ఛార్జి హైకోర్టు జడ్జిగా జస్టిస్ జయసూర్య
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి హైకోర్ట్ జడ్జిలను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు ఈ నెల 6న ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హైకోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా జస్టిస్ జయసూర్యను నియమించారు.
News September 8, 2024
అల్లకల్లోలంగా ఉప్పాడ బీచ్.. నేడు, రేపు జాగ్రత్త
ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగసి పడడంతో ఆ ప్రాంతమంతా కోతకు గురవుతోంది. బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన రాళ్ల గోడను సైతం దాటుకుని అలలు ఎగసి పడుతున్నాయి. శనివారం బీచ్ రోడ్డులో వెళ్లిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలల కారణంగా తీర ప్రాంతంలో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. కాగా.. వాతావరణ శాఖ అధికారులు తీర ప్రాంత ప్రజలు ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.