News February 19, 2025
కాకినాడ: జగన్‌ను కలిసిన మాజీ మంత్రి కన్నబాబు

కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే,వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం సాయంత్రం పార్టీ అధినేత జగన్‌ను కలిశారు. ఆయనను ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌గా నియమించిన తర్వాత తొలిసారిగా తాడేపల్లి వెళ్లి అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకం వమ్ము కాకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన జగన్‌కు హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ వివాదంపై చర్చించారు.
Similar News
News November 22, 2025
ప.గో: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 22, 2025
ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్‌రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.
News November 22, 2025
ASF జిల్లాలో రిజర్వేషన్లపై ఉత్కంఠ

ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్లపై గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 50 శాతాన్ని మించకుండా రిజర్వేషన్ల ప్రక్రియలు కొనసాగించనున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులంతా అధికారిక ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


