News February 12, 2025
కాకినాడ: జగన్ స్కాములపై విచారణ తప్పనిసరి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐ, ఈడి సంస్థలతో విచారణ చేయించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తాడేపల్లి కేంద్రంగా జరిగిన స్కాముల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇందులో ప్రధానమైందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం జగన్ పై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలన్నారు.
Similar News
News December 3, 2025
శ్రీకాంతాచారి చిరస్థాయిగా నిలిచిపోయాడు: కవిత

మలి దశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చేసిన ఆత్మబలిదానం రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ జ్వాలను మరింతగా రగిల్చిందని జాగృతి చీఫ్ కవిత అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ అమరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఎల్బీనగర్లోని విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు శ్రీకాంతాచారి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
News December 3, 2025
కోర్టుకెక్కిన పేరూరు గ్రామ ‘పంచాయితీ’..!

నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం పేరూరులో ఎస్టీ మహిళ ఓటర్లు లేకున్నా గ్రామ సర్పంచ్, వార్డులు ఎస్టీ మహిళకి రిజర్వ్డ్ కావడంతో పంచాయతీ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రామంలో కేవలం ఒక్కరే ఎస్సీ అభ్యర్థి (పురుషుడు) ఉన్నారు. గ్రామ పంచాయతీలు 8 వార్డులు ఉండగా వాటిలో నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్డ్ చేశారు. ప్రస్తుతం ఈ పంచాయితీ కోర్టుకెక్కింది.
News December 3, 2025
హనుమాన్ చాలీసా భావం – 28

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>


