News August 20, 2024
కాకినాడ: జనసేన జనవాణికి 40 దరఖాస్తులు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో సోమవారం నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమానికి 40 దరఖాస్తులు అందాయని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలు, జిల్లాకు చెందిన పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు అందజేశారన్నారు. దరఖాస్తులను మంగళగిరి జనసేన కార్యాలయానికి పంపిస్తున్నామన్నారు.
Similar News
News September 14, 2024
రాజానగరంలో తీవ్ర విషాదం
రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున వృద్ధ దంపతులు పురుగు మందు వేసుకొని టీ తాగారు. ఈ ప్రమాదంలో వెలుచూరి గోవింద్(75), అప్పాయమ్మ (70) మృతి చెందారు. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పొలాలకు చల్లే గుళికల ప్యాకెట్‌ను టీ ప్యాకెట్‌గా భావించి టీ పెట్టుకొని తాగారు. కొద్దిసేపటికే నోటి నుంచి నురగలు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
News September 14, 2024
కాకినాడ: యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలకపదవి
వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.
News September 14, 2024
ఉమ్మడి తూ.గో. జడ్పీ ఇన్‌ఛార్జి CEOగా పాఠంశెట్టి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఇన్‌ఛార్జి సీఈవోగా పాఠంశెట్టి నారాయణ మూర్తి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన కాకినాడ డివిజన్ డీఎల్డీవో విధులు నిర్వర్తిస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇంతవరకు ఇక్కడ సీఈవోగా పనిచేసిన ఎ.శ్రీరామచంద్రమూర్తి రిలీవ్ అయిన విషయం తెలిసిందే.