News March 5, 2025

కాకినాడ: జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

image

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, పత్తిపాడు అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల కోర్టులలో ఇవి నిర్వహిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు.

Similar News

News November 11, 2025

‘రాజాసాబ్’.. ప్రభాస్ సూపర్ లుక్

image

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.

News November 11, 2025

సాగర్‌లో క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్

image

మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా ప్రారంభించారు. మంగళవారం నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14, 19 పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ రాజకుమార్, ఆర్సీఓ స్వప్న పాల్గొన్నారు.

News November 11, 2025

రాజన్న ఆలయాధికారులతో కలెక్టర్ సమావేశం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో ఆలయ EO రమాదేవి, EE రాజేష్, DE రఘునందన్లతో కలిసి ఆమె ఆలయ పనుల తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఒకే మార్గం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్న క్రమంలో తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించినట్లు సమాచారం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.