News March 5, 2025
కాకినాడ: జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, పత్తిపాడు అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల కోర్టులలో ఇవి నిర్వహిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు.
Similar News
News February 16, 2026
ఇంత దానికేనా అంత డ్రామా!

T20 WCలో భారత్-పాకిస్థాన్ మ్యాచులో వార్ వన్ సైడ్ అయింది. టీమ్ ఇండియాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక దాయాది తేలిపోయింది. దీంతో టోర్నీకి ముందుకు పాక్ ‘బాయ్‌కాట్’ డ్రామా ఆడింది ఇందుకేనా అంటూ భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించి ఇండియాతో ఆడబోమంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. టోర్నీలో USA లాంటి చిన్న జట్లు మంచి పోటీ ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు.
News February 16, 2026
ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

మారిన జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే BP బారిన పడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు రోజూ మాత్రలు వాడుతున్నారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఏటా 2 ఇంజెక్షన్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మేరకు USకు చెందిన రోచీ అండ్ అల్నిలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
News February 16, 2026
పాలమూరు వర్సిటీ: రీకౌంటింగ్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఫలితాలపై సందేహాలున్న వారు సబ్జెక్టుకు రూ.300 చొప్పున ఫీజు చెల్లించి, సంబంధిత పత్రాలను కాలేజీలో సమర్పించాలని అధికారులు సూచించారు.


