News April 15, 2025
కాకినాడ: జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ

మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. తుని, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు, ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలకు పంపించిన చరవాణి హెచ్చరికల్లో పేర్కొంది.
Similar News
News April 20, 2025
ములుగు: రాజీవ్ యువ వికాసం పథకానికి 4,698 దరఖాస్తులు

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి 4,698 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఏటూరునాగారం 415, గోవిందరావుపేట 541, కన్నాయిగూడెం 247, మల్లంపల్లి 126, మంగపేట 563, ములుగు 863, తాడ్వాయి 504, వెంకటాపూర్ 249, వెంకటాపురం 520, వాజేడులో 670 మంది వివిధ యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
News April 20, 2025
గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
ADB ITI కళాశాలలో రేపు అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ అందజేస్తామన్నారు.