News April 10, 2025

కాకినాడ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

image

కాకినాడ జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది.

Similar News

News October 25, 2025

నవంబర్ 4న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు

image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నవంబరు 4న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అభివృద్ధి అధికారి కాసింబి శనివారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ వేడుకల్లో పాల్గొనే ఆసక్తి గలవారు నవంబరు 1లోగా కలెక్టర్ కార్యాలయంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 25, 2025

కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో మొంథా తుపాన్‌ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ఐరన్ రేకులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు వహించాలన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ 94910 41419, టోల్ ఫ్రీ నంబర్ 18002 331077 ఏర్పాటు చేసినట్లు వివరించారు.

News October 25, 2025

గుంటూరు జిల్లాలో స్కూళ్లకు 3 రోజులు సెలవులు

image

మెంథా తుపాన్ దృష్ట్యా 27, 28,29 తేదీల్లో పాఠశాలలకు కలెక్టర్ తమీమ్ అన్సారియా సెలవు ప్రకటించారు. తల్లిదండ్రులు చిన్నారులను బయటకు పంపొద్దన్నారు. ప్రజలు తుపాన్ దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 0863 2234014 ఏర్పాటు చేశామని దీంతోపాటు డివిజన్ మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు.