News April 12, 2025
కాకినాడ జిల్లాకు 20వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో కాకినాడ జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 17,326 మంది పరీక్షలు రాయగా 13,582 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 20,398 మందికి 12,920 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 15వ స్థానంలో కాకినాడ జిల్లా నిలిచింది.
Similar News
News January 9, 2026
NZB: కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన ఎంపీ అరవింద్

నిజామాబాద్ కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో జరిగిన ఈ భేటీలో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులపై వారు చర్చించారు. నూతన కలెక్టర్కు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
News January 9, 2026
ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరికలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోపిష్టి అయిన ట్రంప్ చేతులు ఇరాన్ పౌరుల రక్తంతో తడిచాయి. అతను స్వదేశంలోని సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది. వేరే దేశాధ్యక్షుడి మెప్పుకోసం ఇరాన్లో నిరసనకారులు తమ వీధులను పాడు చేసుకుంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు.
News January 9, 2026
సిద్దిపేట: ‘అందరూ కలిసి టీం వర్క్ చేయాలి’

అందరూ కలిసి టీం వర్క్ చేయాలని సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట్ నూతన పోలీస్ కమిషనరేట్లో పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి తదనంతరం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అందరూ కలిసి టీం వర్క్ చేయాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.


