News January 4, 2025

కాకినాడ జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన

image

ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో ఇప్పటికే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాకినాడ జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈమేరకు CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అన్నవరం, తుని మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ మేరకు ఆ ఏరియాలో 757 ఎకరాలను గుర్తించినట్లు సీఎం నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

Similar News

News November 25, 2025

తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

image

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.

నిడదవోలు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

image

నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్‌లో జరిగే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.