News June 4, 2024

కాకినాడ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్

image

పోస్టల్ బ్యాలెట్లలో కాకినాడలోని 7 నియోజకవర్గాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కాకినాడ MP అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 9,530 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. ఈయనకు 30,779 ఓట్లు రాగా.. YCP అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌కు 21,249తో వెనుకంజలో ఉన్నారు. కాకినాడ-వనమాడి, కాకినాడ రూరల్-పంతం నానాజీ, పిఠాపురం-పవన్, ప్రత్తిపాడు-సత్యప్రభ, పెద్దాపురం- చినరాజప్ప, తుని- దివ్య, జగ్గంపేట- నెహ్రూ ముందంజలో ఉన్నారు.

Similar News

News January 10, 2026

తూ.గో: నిమ్మ ధర డమాల్.. నష్టాల్లో రైతులు

image

తూ.గో.లో నిమ్మకాయల ధరలు పడిపోవడంతో సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జూన్‌లో 50 కిలోల బస్తా ధర రూ.2 వేలు ఉండగా, ప్రస్తుతం సగానికి తగ్గిందని ఆరోపిస్తున్నారు. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదని వాపోతున్నారు. ప్రధానంగా దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం నుంచి ఇతర మండలాల్లో 3,200 హెక్టార్లలో నిమ్మ సాగు చేస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు.

News January 10, 2026

చింతా అనురాధకు కీలక పదవి

image

YCP జోన్-2 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అమలాపురం మాజీ MP చింతా అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల బాధ్యతలను ఆమె పర్యవేక్షిస్తారు. 2029 ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనురాధ కృతజ్ఞతలు తెలిపారు.

News January 10, 2026

కొవ్వూరు: గోదావరిలో దూకబోయిన వ్యక్తిని రక్షించిన పోలీసులు

image

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వాదలకుంటకు చెందిన వినపల్లి నవీన్‌ను పట్టణ పోలీసులు రక్షించారు. 112 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ సూరిబాబు సకాలంలో చేరుకుని యువకుడు నదిలో దూకకుండా అడ్డుకున్నారు. కుటుంబ సమస్యలే దీనికి కారణమని సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ప్రాణం కాపాడిన పోలీసుల తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.