News March 21, 2025
కాకినాడ జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

కాకినాడ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా కాకినాడ, పిఠాపురంలో అప్పుడే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Similar News
News November 20, 2025
వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ. 2.03 కోట్లు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం 27 రోజుల హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రూ. 2 కోట్ల 3 లక్షల 25 వేల 676 వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. హుండీ ద్వారా 228 గ్రాముల బంగారం, 14 కిలోల 300 గ్రాముల వెండి సమకూరినట్లు ఆమె పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది, ఎస్ఎఫ్ఐ, హోంగార్డుల పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది.
News November 20, 2025
బోర్డులను “బ్రోకర్ల డెన్”లుగా మార్చారు: సంజయ్

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.
News November 20, 2025
రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్ చేశారు. బాధితులు టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


