News February 24, 2025
కాకినాడ జిల్లాలో దంచేస్తున్న ఎండలు

కాకినాడ జిల్లాలో ఆదివారం ఎండతీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పిఠాపురం, కాకినాడ పట్టణాలతోపాటు పరిసర ప్రాంతాల్లో నిన్న ఉదయం నుంచే ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే నెల రాకుండానే ఎండలు దంచేస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రయాణాలు చేసేవారు మంచినీళ్ల బాటిళ్లు వెంట తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 1, 2025
నేటి నుంచే పార్లమెంట్ వింటర్ సెషన్స్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా, ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలపనున్నారు. తాజా సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు SIRపై ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధం కాగా వాడీవేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
News December 1, 2025
శివుడు ఎలా జన్మించాడో తెలుసా?

సృష్టి కార్యంలో భాగంగా విష్ణువు నుదుటి తేజస్సు నుంచి శివుడు ఆవిర్భవించాడని మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే శివుడు స్వయంభూ అని, ఆయన ఎవరి నుంచి జన్మించలేదని, ఆయనే సర్వానికి మూలమని శివ పురాణం పేర్కొంటుంది. శివుడు ధ్యానంలో రుద్రాక్షమాలను లెక్కిస్తున్నప్పుడు, ఓ రుద్రాక్ష నుంచి విష్ణుమూర్తి జన్మించాడని చెబుతోంది. ఈ భిన్న కథనాలు అంతిమంగా త్రిమూర్తుల ఏకత్వతత్త్వాన్ని చాటిచెబుతున్నాయి.
News December 1, 2025
సంగారెడ్డి: జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక

అండర్-19 జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సంగారెడ్డిలోని జూనియర్ కళాశాల విద్యార్థి లెవిన్ మానిత్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన లెవెన్ కళాశాలలో ఘనంగా సన్మానించారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపల్ సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.


