News February 15, 2025
కాకినాడ: జిల్లాలో దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 14, 2025
పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపు: చాహత్ బాజ్ పేయ్

భద్రకాళి చెరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్టులు అమలుతో పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, నగర సౌందర్యాన్ని మరింత పెంచుతాయని కుడా వైస్ ఛైర్పర్సన్ చాహత్ బాజ్ పేయ్ అన్నారు.భద్రకాళి ఆలయం నుంచి భద్రకాళి బండ్ వరకు ప్రతిపాదిత రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్ట్ అమలు కోసం పలు సంస్థల ప్రతినిధులు తమ ప్రెజెంటేషన్లు సమర్పించారు. ఈ ప్రజెంటేషన్లను వైస్ ఛైర్పర్సన్ సమీక్షించారు.
News November 14, 2025
గుంటూరు డివిజన్ మీదుగా స్పెషల్ ట్రైన్స్

గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ తాత్కాలికంగా నడుపుతోంది. సికింద్రాబాద్-కాకినాడ రూట్పై నడిచే 07619 రైలు నవంబర్ 16వ తేదీన నడికుడి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుందని తెలిపారు. బెంగళూరు-భాగల్పూర్ (06565) రైలు నవంబర్ 15న విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తుందని, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా నడుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
News November 14, 2025
HYD: BRSను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తున్నారా అని ఇటీవల KTR అన్నారని, కచ్చితంగా భావిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ఆధిక్యంపై ఆయన మాట్లాడారు. ప్రజాపాలన వైపు ప్రజలు ఉన్నారన్న దానికి ఇది నిదర్శనమన్నారు. BRSను ప్రజలు నమ్మడం లేదని, అది ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. అభివృద్ధికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, తాము బీసీ బిడ్డకు టికెట్ కేటాయించామన్నారు.


