News February 15, 2025

కాకినాడ: జిల్లాలో దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

image

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News March 25, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,290గా ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,10,000గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది.

News March 25, 2025

MLAలు పార్టీ మారి వార్షికోత్సవం పూర్తైంది: సుప్రీం

image

TG: పార్టీ మారిన MLAల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రతివాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘MLAలు పార్టీ మారి ఇప్పటికే వార్షికోత్సవం పూర్తైంది. రీజనబుల్ టైమ్ అంటే వారి పదవీకాలం పూర్తయ్యేవరకా? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోతే పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేసినట్లే. ఆలస్యం చేసే ఎత్తుగడలు వేయొద్దు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలి’ అని ప్రభుత్వ తరఫు లాయర్‌ను ఆదేశించింది.

News March 25, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ధరలు..?

image

నెల్లూరులో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నిరుడు పుట్టి(20 బస్తాలు) రూ.23వేల ధర పలగ్గా.. ఇప్పుడు ఆ ధర రూ.18,500కు తగ్గినట్లు రైతులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఈ ధర రూ.16వేల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతులకు రూ.19వేల మద్దతు ధర చెల్లిస్తుంది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో గ్రామం, మండలంతో కామెంట్ చేయండి.

error: Content is protected !!