News March 7, 2025
కాకినాడ జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. కాకినాడ జిల్లా వాసులు తూ.గో, కోనసీమ జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థల్లో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా కాకినాడ జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.
Similar News
News March 23, 2025
ఉప్పల్ స్టేడియంలో IPL.. ఆరెంజ్ ఆర్మీ (PHOTO)

ఉప్పల్ స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీతో కలకలలాడుతుంది. SRH VS RR మధ్య ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ కొనసాగుతుండగా ఎక్కడ చూసినా ఆరెంజ్ ఆర్మీ సందడి కనిపిస్తోంది. HYD క్రికెట్ ఫ్యాన్స్, ఆరెంజ్ ఆర్మీ అంటే మామూలుగా ఉండదని.. డైలాగ్స్ వేస్తూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతుండగా ఆరెంజ్ ఆర్మీ ఫీవర్ స్పష్టంగా కనిపించేలా ఫోటో తీయగా వైరల్ అవుతుంది. CREDIT: ఫోటోగ్రాఫర్: పృథ్వి చౌదరి.
News March 23, 2025
స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్ ఫ్యామిలీ

AP: మంత్రి లోకేశ్ కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి’ అని ట్వీట్ చేశారు.
News March 23, 2025
సీట్లే కాదు పార్లమెంటులో ప్రాధాన్యత కోసం పోరాటం: కేకే

TG: పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ప్రభుత్వ సలహాదారు K కేశవరావు ఆకాంక్షించారు. ఎంపీ సీట్ల గురించే కాకుండా పార్లమెంటులో తమ గళానికి ప్రాధాన్యత కోసం రాష్ట్రాలు పోరాడుతున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే కేంద్రం డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలని సూచించారు. పార్లమెంటులో చట్టం ఆమోదం పొందాకే పునర్విభజన చేయాలన్నారు.